HomeAndhrapradesh-newsRisailam Ugadi Utsavalu Bramaramba Mallikarjuna Swamy Appeared On Kailasa Vahanam
Srisailam | కైలాస వాహనంపై అలరించిన శ్రీశైలేశుడు.. లక్షలాదిగా తరలివచ్చిన కన్నడ భక్తులు
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్లు ప్రత్యేక పూజలు జరిగాయి.
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్లు ప్రత్యేక పూజలు జరిగాయి.
అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం సాయంకాల పూజలు జపానుష్టాది పూజాధి కార్యక్రమాలు జరిపించారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్పమూర్తులను కైలాస వాహనంపై వేంచుంబజేసి షోడషోపచార ప్రత్యేక పూజలు అర్చక వేదపండితులచే నిర్వహించారు.
కైలాసవాహనంపై అధిరోహించిన స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నేరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని ఇతిహాసాల్లో చెప్పబడుతోంది.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీ శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాదుర్గ అలంకరణలో భక్తులను కరుణించింది.
అష్టభుజాలు కలిగిన ఈదేవి పద్మం, శంఖం, చక్రం, గద, త్రిశూలం, ఖడ్గం ధరించి భక్తాధులకు దర్శనమిచ్చింది.
ఈ అమ్మవారిని దర్శించడం వల్ల ఎటువంటి శత్రు బాధలు, పీడలు నుంచైనా భక్తులను కాపాడుతుందని నమ్మిక.
వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు, వివిధ రకాల కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.