హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీచేసింది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ శనివారంనుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు మారనున్నాయి. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. ఈ సవరణతో కొన్ని ప్రాంతాలలో భూముల ధరలు తగ్గనుండగా, కొన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశాలున్నాయి.