తిరుమల : వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో (Tirumala) భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. ముఖ్యగంగా రథ సప్తమి (Rathasapthami) రోజున ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ వాహనాల్లో భక్తులకు స్వామివారు కనువిందు చేయనుండడంతో భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ టికెట్లు జారీ చేయకపోవడంతో భక్తులు నేరుగా వచ్చి క్యూలైన్లో ప్రవేశిస్తున్నారు. సర్వ దర్శనానికి 20గంటల సమయం పడుతోంది. నిన్న స్వామి వారిని 76,646 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్లు మకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు నేడు సూర్య జయంతి సందర్భంగా తిరుమలో రథసప్తమి మహాత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీమలప్ప స్వామి వారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. రథ సప్తమికి 2.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.