Tirupati | తిరుపతిలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థినితో పరిచయం పెంచుకున్న ర్యాపిడో డ్రైవర్.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు కూడా దిగాడు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని ప్రైవేటు హాస్టల్లో ఉంటుంది. అక్కడి నుంచి మరో హాస్టల్‌కు మారుతున్ సమయంలో ర్యాపిడోలో ఆటోను బుక్ చేసుకుంది. అప్పుడు ర్యాపిడో ఆటో డ్రైవర్ సాయికుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఫోన్ నంబర్ తీసుకున్న సాయికుమార్ తరచూ విద్యార్థినికి కాల్ చేసేవాడు. ఏదైనా సాయం కావాలంటే చెప్పు చేస్తానని కూడా చెప్పేవాడు. ఈ క్రమంలో విద్యార్థినికి ఒకసారి డబ్బులు అవసరం పడటంతో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్‌ను అడిగింది. ఇదే అదనుగా భావించిన సాయికుమార్.. విద్యార్థినిని తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన విద్యార్థిని తన స్నేహితురాలికి విషయం చెప్పింది. ఆమె సాయంతో అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు విద్యార్థిని మైనర్ కావడంతో నిందితుడిపై ఫోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.