అమరావతి : నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఏపీలోని రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. అనంతపురం (Anantapur district ) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఉరవకొండ, విడపనకలు, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షతో పలుచోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి వంక, పెంచుల పాడు-పొలికి గ్రామాల మధ్య పెద్ద వంక ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి .
సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో గాలి, వాన బీభత్సం సృష్టి్ంచాయి. కొత్త చెరువు-ధర్మవరం ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం నేలకూలింది . ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్త చెరువు -పెనుగొండ మార్గంలో రైల్వే వంతెన కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
లోచర్ల వద్ద దశాబ్దాల నాటి చింతచెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడి( Lightning ) వీరయ్య, శ్రీనివాసరావు అనే ఇద్దరు రైతులు మృతి అక్కడికక్కడే మృతి చెందారు.