అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. qల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మరో 48 గంటల్లో వర్షాలు (Rains) పడుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 35-45 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ఉత్తర, దక్షిణకోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపారు.
అల్పపీడనంతో కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వివరించారు. రేపు కాకినాడ, విశాఖ,అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేయనున్నట్లు తెలిపారు.మత్య్సకారులు రేపటి నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.