అమరావతి : మహారాష్ట్ర (Maharastra ) ఎన్నికల్లో అబద్దాలతో ప్రచారం చేసి ఓటమిపాలైన రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satyakumar) డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు (NDA) అనుకూలంగా రావడంతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకు చెందిన మంత్రులు డబ్బుల సంచులతో మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో చ్చిన హామీ మేరకు ఏపీలో మహిళలకు పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ కూటమి మాత్రమే నెరవేరుస్తుందని అన్నారు. ఎన్డీయే కూటమిపై ఉన్న విశ్వాసంతో మరోసారి అధికారం ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.