Viral Video | ఏపీలో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చితకబాదుతున్న వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోలో ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చుట్టూ చేరి చితకబాదారు. మోకాళ్ల మీద నిల్చోబెట్టి మరీ దాడికి దిగారు. క్షమించమని అడిగినప్పటికీ కనికరించకుండా ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. పదే పదే కొట్టడమే కాకుండా కింద పడేసి కాలితో తన్నుతూ రెచ్చిపోయారు. ఓ విద్యార్థి ఆపమని చెప్పినా వినకుండా మరింత దుర్మార్గంగా వ్యవహరించాడు. ఈ తతంగమంతా కూడా అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్లో రికార్డు చేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడంతో సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
తిరుపతిలోని సత్యవీడు సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం
ఓ విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాది.. కాళ్లతో తన్నుతూ దాడి చేసిన తోటి విద్యార్థులు
కాలేజీ బీజేపీ నేతకు చెందిందిగా చెబుతున్న స్థానికులు pic.twitter.com/7seVKSgle9
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2025
కాగా, ఈ వీడియోలో ఉన్నది తిరుపతి జిల్లా సత్యవీడులోని సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కాలేజీ బీజేపీ నేతకు చెందినదిగా స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై దాడికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.