అమరావతి : బీజేపీ ( BJP) ఆంధ్రప్రదేశ్‌శాఖ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ (PVN Madhav ) పేరు ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అధ్యక్షపదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. మాధవ్ తండ్రి బీజేపీ సీనియర్ నాయకుడు, దివంగత చలపతిరావు గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా, పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం పనిచేస్తున్నారు.