Srisailam | శ్రీశైల స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూర్ణమి ప్రత్యేక పూజలు!
Srisailam | శ్రీశైల భ్రమరంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు పౌర్ణమి సందర్భంగా ఆదివారం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మ వార్ల క్షేత్రంలో ఆదివారం పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం పరివార దేవతలకు ఘనంగా అర్చనలు, అభిషేకాలు చేశామని అర్చక పండితులు చెప్పారు. ఆదివారం సాయంత్రం పౌర్ణమి సంధ్యా సమయంలో స్వామిఅమ్మవార్లను ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో ఆశీనులను చేసి అష్టోత్తర నామావళి, ఖడ్గమాల పఠించారు.
శ్రీభ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ జరిపించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు, భక్తులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాల తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

వర్షం వల్ల గిరి ప్రదక్షిణ రద్దు
ఆదివారం మధ్యాహ్నం నుండి కురుసున్న వర్షం కారణంగా సాయంత్రం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు శ్రీశైలం ఏఈవో హరిదాసు తెలిపారు. స్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలు మాత్రమే చేసుకున్నారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు సుమారు 30 వేల మందికి పైగా ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకున్నారు.
సర్వదర్శనానికి నాలుగు గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పట్టిందని పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా నిలివేశారు.

పరోక్షసేవకు విశేష ఆదరణ
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈవో లవన్న తెలిపారు. నిత్య ఆర్జిత పరోక్ష సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్షకుంకుమార్చనలో భక్తులు తమ గోత్ర నామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారని తెలిపారు. భక్తులు <http://www.srisailadevasthanam.org> ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఈవో కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

