అమరావతి : ఏపీలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం( Indipendence Day) సందర్భంగా కాకినాడ (Kakinada) జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంతృత్య పోకడలు, జాతీ సంపదను దోచుకోవడం, ప్రజలను నిర్లక్ష్యం చేసిన పాలకులకు ప్రజలు ఎప్పుడూ బుద్ధి చెబుతారని అన్నారు. సూపర్ సిక్స్ ( Super Six ) పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 28 రకాల సామాజిక పెన్షన్లు (Pensions) అందిస్తు అండగా నిలుస్తుందని తెలిపారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ (Dokka Sitamma) పేరుతో అమలు చేస్తుందని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సర్పంచులకు అధికారాలు, సాతంత్య్ర, గణ దినోత్సవా వేడుకల నిర్వహణకు నిధుల పెంచడం లాంటి కార్యక్రమాలు ప్రారంభించామని స్పష్టం చేశారు. దేశ భక్తి పెంపొందించే విధంగా మైనర్ పంచాయతీలకు పది వేలు, మేజర్ పంచాయతీకు రూ. 25 వేలు అందిస్తున్నామని వివరించారు.