అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) విశాఖపట్నంకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం రెండు రోజుల రాష్ట్రాల పర్యటన సందర్భంగా తొలిరోజు విశాఖలో (Visaka) అడుగుపెట్టిన ప్రధానికి ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్ ( Governor Nazeer Ahmed) , ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra Babu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , మంత్రులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
రాష్ట్రంలో సుమారు రెండు లక్షల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం రెండు కిలోమీట్లర్ల పాటు నిర్వహించనున్న రోడ్ షోలో ముగ్గురు నాయకులు పాల్గొననున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు మూడు లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నాయకులు ఇది వరకే ప్రకటించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
ప్రధాని రాక సందర్భంగా విశాఖను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రెండు కిలో మీటర్ల పరిధిలో నో డ్రోన్స్ ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 35 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో మూడు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.