Kurnool Bus Accident | బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మాటలకందని ఈ విషాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు (mobile phones) ఉన్నట్లు గుర్తించారు.రూ.46 లక్షలు విలువైన దాదాపు 234 మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉన్నట్లు గుర్తించారు. బస్సు ఢీ కొట్టగానే బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడి అందులోని పెట్రోల్ మొత్తం రోడ్డుపై పడింది. బైక్‌ను బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఆ అధిక వేడికి బస్సు లగేజ్ క్యాబిన్లో ఉన్న మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద శబ్దం వచ్చింది.
సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగం ప్లాస్టిక్‌తో తయారు చేసినప్పటికీ.. బ్యాటరీలు మాత్రం లిథియంతో తయారు చేస్తారు. అవి అధిక వేడికి పేలుతాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో అధిక వేడికి అవి పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు భావిస్తున్నాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ నుంచి పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని.. దీంతో వారు తప్పించుకునే ఛాన్స్ లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్లే కారణమని ప్రాథమికంగా తేలింది.
Also Read..
మంటల్లో ప్రాణాలు.. శోకంలో కుటుంబాలు.. కర్నూలు బస్సు ప్రమాదంలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
సీటింగ్‌కు పర్మిషన్ స్లీపర్‌గా ఆల్ట్రేషన్.. పర్మిట్ లేని బస్సు, ఫిట్‌నెస్‌లేని మృత్యుశకటం
రహదారులపై మృత్యుఘోష.. కర్నూల్ ఘటనతో మరోసారి ‘ప్రైవేట్ ట్రావెల్స్’పై చర్చ
ట్రావెల్స్ బస్సులో మృత్యుఘోష.. 19 మంది సజీవ దహనం