హైదారాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైరన ఘటనలో 19 మంది మృతిచెందారు. రోడ్ ఇంజినీరింగ్, బస్డిజైన్కు సంబంధించి లోపం ఉండటం వల్లే గతంలో పాలెం బస్సు ప్రమాదం జరిగిందని, కర్నూల్ ఘటనలో కూడా ఇదే తరహా ఉండి ఉండే అవకాశం ఉంటుందని బా పట్ల ఎంపీ కృష్ణప్రసాద్ తెలిపారు.
అక్టోబర్ 30 2013న జరిగిన పాలెం బస్సు ప్రమాదంలో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు మార్గంలో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. టికెట్ల దొరకడం ఇబ్బందికరంగా మారడంతో ప్రయాణికులు బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు బస్సు యాజమాన్యాలు మాత్రం సంపాదనపై పెట్టే ఆసక్తి వాటి నిర్వహణ విషయంలో చూపడం లేదనే విమర్శలు చాలా ఏండ్లుగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం కారణంగా ప్రైవేట్ బస్సుల యాజమానులు చెలరేగిపోతున్నారు.