KA Paul | అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా.. జగన్కు కేఏ పాల్ వార్నింగ్
KA Paul | అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్ను కలిసేందుకు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కేఏ పాల్ వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేకపోవడంతో సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో జగన్ అపాయింట్మెంట్ కోసం క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై చాలాసేపు వేచి ఉన్నారు.
KA Paul | అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్ను కలిసేందుకు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కేఏ పాల్ వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేకపోవడంతో సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో జగన్ అపాయింట్మెంట్ కోసం క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై చాలాసేపు వేచి ఉన్నారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై చర్చించి.. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని చెప్పారు. ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని.. లేదంటే శపిస్తానని హెచ్చరించారు. తాను దేవుడి దూత, ప్రపంచ శాంతి దూతను చెప్పిన ఆయన.. తనను ఎవరూ ఆపలేరని తెలిపారు. 155 దేశాల ప్రెసిడెంట్లు తనను కలిశారని.. దేశంలో 14 మంది ముఖ్యమంత్రులు తనను కలుస్తున్నారని పేర్కొన్నారు. స్టాలిన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్, శరద్ పవార్ ఇలా ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు ఎందరో తనను కలిశారని చెప్పారు. తనను కలవని వారు లేరని కూడా తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తనను కలిశారని.. జగన్మోహన్ రెడ్డి కూడా కలుస్తారనే ఆశతోనే వచ్చానని అన్నారు. తనను తిరస్కరిస్తే దేవుణ్ని తిరస్కరించినట్టేనని హెచ్చరించారు. మంగళ, బుధవారం విజయవాడలోనే ఉండి జగన్ కోసం వేచి చూస్తానని తెలిపారు. కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ సీఎం అవుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో.. 75 సీట్లు గెలుస్తారో.. 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదని అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రాకముందు కేఏ పాల్.. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్కుమార్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఎన్నికలు చివరి దశలో నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికల రోజే ఫలితాలు కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

