(Police Sports) కర్నూలు: పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021 ఉత్సాహవంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజులపాటు జిల్లా పోలీస్ మైదానంలో కొనసాగనున్నాయి. స్పోర్ట్స్ మీట్‌ను జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రారభించారు. అనంతరం ఆయన వాలీబాల్, కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. అదనపు ఎస్పీ జీ నాగబాబు, డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, వెంకట్రామయ్య, రమణ, రాజేంద్ర, రామాంజి నాయక్, యుగంధర్ బాబు, వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ బాషా, చిదానందరెడ్డి, శృతి, శ్రీనివాసులు, ఇలియాజ్ బాషా, రవీంద్రారెడ్డితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ఆరు డివిజన్ల పోలీసు సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందేందుకు క్రీడలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. నిత్యం విధులు నిర్వర్తించే సమయంలో పోలీసులు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటారని, రోజువారీ ఒత్తిళ్లను అధిగమించేందుకు క్రీడలు సహకరిస్తాయని సూచించారు. ఇలాంటి పోటీల్లో పోలీసులు చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ క్రీడల్లో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి క్రీడల పోటీల్లో పాల్గొనేందుకు పంపిస్తామని ఎస్పీ తెలిపారు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..