వివాహేతర సంబంధాలు.. బలిపీఠంపై కుటుంబాలు
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఏకంగా హత్యలకు దారి తీస్తున్నాయి. మరొకరి మోజులో పడిన భర్త/భార్య తమ జీవిత భాగస్వాములను అంతమొందించేందుకూ వెనుకాడడం లేదు.
- ఇతరుల మోజులో పడి దారుణాలకు పాల్పడుతున్న వైనం
- మొన్న హార్పిక్ ఎక్కించి భర్తను చంపిన ఇల్లాలు
- తాజాగా భోజనంలో గడ్డిమందు కలిపిన భార్య
- భర్త, అత్తను చంపేందుకు యత్నం
- నెల వ్యవధిలోనే వెలుగుచూసిన ఘటనలు..
- విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలు
ఖలీల్‌వాడి, ఆగస్టు 3: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఏకంగా హత్యలకు దారి తీస్తున్నాయి. మరొకరి మోజులో పడిన భర్త/భార్య తమ జీవిత భాగస్వాములను అంతమొందించేందుకూ వెనుకాడడం లేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్నారని కట్టుకున్న వారినే ఖతం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మొన్న ఓ భార్య తన భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేస్తే, తాజాగా మరో భార్య కూరలో గడ్డి మందు కలిపి భర్త, అత్తను హతమార్చేందుకు యత్నించింది. మోపాల్ మండలంలో నెల వ్యవధిలోనే వెలుగు చూసిన ఈ దారుణాలు విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలకు ఉదాహరణగా మారాయి.
భర్త, అత్తను హత్య చేసేందుకు పథకం
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు ఇంటాయనను ఖతం చేయాలని ప్లాన్ వేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తతో పాటు అత్తపై హత్యాయత్నానికి పాల్పడింది. కూరలో గడ్డి మందు కలిపి వారికి వడ్డించింది. అత్త వాంతులు, విరేచనాలతో దవాఖానలో చేరగా, అప్రమత్తమైన భర్త తినడం ఆపేయడంతో బతికి బయటపడ్డారు. మోపాల్ మండలం మొదక్పల్లిలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై సుష్మిత సోమవారం వెల్లడించారు. ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్న తన భార్య సోని, తల్లి భూదేవితో కలిసి ఉంటున్నాడు. అయితే, సోనీ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది.
ఈ క్రమంలో తమ బంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని , వారిని చంపాలని కుట్ర పన్నింది. శనివారం మీల్మేకర్ కూర వండిన సోనీ.. అందులో గడ్డి మందు కలిపింది. భోజనం చేసిన అత్తకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత భర్త అదే కూరను తింటుండగా, పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి తినడం ఆపేశాడు. అప్పటికే తల తిరుగుతుండడంతో భూమన్న, భూదేవిలను నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సోనీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై సుష్మిత తెలిపారు.
నరాల్లోకి హార్పిక్ ఎక్కించి..
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఇల్లాలు తన భర్తకు హార్పిక్ ఎక్కించి అంతమొందించింది. జూలై 6న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మోపాల్ మండలం న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ (35), సంధ్య దంపతులు. కుటుంబ పోషణ నిమిత్తం ప్రశాంత్ కొన్నేండ్లుగా దుబాయ్‌కి వెళ్లి వస్తున్నాడు. నిజామాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పని చేసే సంధ్య, నగరానికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, భర్త ప్రశాంత్ జూన్ 27న దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. అనిల్‌తో తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని సంధ్య ప్లాన్ వేసింది.
న్యాల్కల్కు చెందిన బంటి సహకారంతో అతడి హత్యకు కుట్ర పన్నింది. జూన్ 29న ప్రశాంత్, బంటి కలిసి తమ ఇంటి దాబాపై మద్యం సేవించేలా ఏర్పాట్లు చేసింది. ఫుల్లుగా మద్యం తాగిన భర్తను సంధ్య, బంటి కలిసి దాబా పైనుంచి కిందకు తోసేయగా, ప్రశాంత్ గాయాలతో బయట పడ్డాడు. దవాఖానలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య.. అతని చేతికి ఉన్న క్యాన్లా ద్వారా హార్పిక్‌ను ఎక్కించింది. పరిస్థితి విషమించి ప్రశాంత్ చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, హత్య విషయం వెలుగు చూసింది. సంధ్య, అనిల్, బంటిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

