Cordon search | శ్రీకాళహస్తిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. పలు వాహనాలు సీజ్
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పట్టణంఎన్టీఆర్ నగర్, కొండమిట్ట ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పట్టణంఎన్టీఆర్ నగర్, కొండమిట్ట ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర అవసరమైన పత్రాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సేవించి భవిష్యత్తును పాడుచోసుకోవద్దని సూచించారు. పిల్లల కదలికలను పేరెంట్స్ గమనిస్తూ ఉండాలన్నారు.
అలాగే మహిళల భద్రతపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలపై ఎలాంటి వేధింపులు, అఘాయిత్యాలు జరిగినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1091, 1972, 112, 100, 181 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఇకపైకూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తనిఖీలకు ప్రజలు సహకరించాలని కోరారు. కొత్తవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో సీఐలు వెంకటేష్, నాగరాజు, ఇబ్రహీం,లక్ష్మి నారాయణ,ఎస్ఐ లు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

