ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు పెట్టిన జాతీయ నాయకుల పేర్లపై వివాదం చెలరేగుతుంది. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవ్వాళ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ నిరసన తీవ్ర రూపం దాల్చింది. మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి ఆందోళన కారులు నిప్పు పెట్టారు. ఫర్నీచర్‌ను కూడా దహనం చేశారు. ఈ సమయంలో మంత్రి పినిపె ఇంట్లోనే వున్నారు. మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనకారులు తీవ్ర నినాదాలు కూడా చేశారు. ఆందోళనకారులు నిప్పంటించడంతో ఇంటిని వదిలి మంత్రి బయటికి వెళ్లిపోయారు. ఇంటికి నిప్పంటించడంతో ఇంట్లో వున్న మూడు కార్లు తగలబడిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు పెట్టిన జాతీయ నాయకుల పేర్లపై వివాదం చెలరేగుతుంది. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ జిల్లాలోని అమలాపురంలో యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట , ఘర్షణ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.