అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu) కు గుంటూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వివిధ కేసుల్లో అరెస్టయిన రాంబాబును రాజమండ్రి జైలు ( Jail ) నుంచి గుంటూరు కోర్టుకు సోమవారం తరలించారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు.
ఈ కేసుతో పాటు తిరుమల లడ్డూ వ్యవహారంలో నిర్వహించిన నిరసనలో సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై టీడీపీ నాయకులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కూడా గుంటూరు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు తీసుకువచ్చారు.
అంబటి రాంబాబు వేసిన బెయిల్ పిటిషన్పైతో పాటు జైలులో అదనపు సౌకర్యాలకు కల్పించాలని రాంబాబు వేసిన పిటిషన్పై సోమవారం విచారణ కొనసాగింది. రిమాండ్ అనంతరం తిరిగి ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు.