అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తన అన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌కు సమీపంలోని పోచంపల్లి ప్రాంతంలో జరుగుతున్న విశ్వంభర షూటింగ్(Vishwambhara Shooting) వద్దకు పవన్ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరీ మధ్య ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రచార హోరు, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన పార్టీకి ఫండ్ కింద చిరంజీవి రూ. 5 కోట్లు విరాళం అందజేశారు. ఆయన వెంట మరో సోదరుడు నాగబాబు కూడా ఉన్నారు.
ఏపీలో అధికార వైసీపీని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, బీజేపీతో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా జనసేన ఏపీలోని రెండు లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులు ఖరారై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండుచోట్ల ఓటమి పాలయ్యారు.
జనసేనానికి శ్రీ చిరంజీవి గారి ఆశీర్వాదాలు… జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం @KChiruTweets @PawanKalyan pic.twitter.com/4DZ9XLJ9aT
— JanaSena Party (@JanaSenaParty) April 8, 2024