అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ను సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu) ముంబాయిలో పరామర్శించారు. భుజం నొప్పితో బాధపడుతున్న పవన్‌కల్యాణ్ శనివారం ముంబాయి ( Mumbai ) లోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో పాటు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ తదితరులు పరామర్శించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గత కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న పవన్‌కల్యాణ్ వైద్య నిపుణుల సూచనల మేరకు చేయించకున్న ఆపరేషన్ విజయవంతమైందన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెండువారాల విశ్రాంతి అనంతరం పవన్‌కల్యాణ్ విధుల్లో పాల్గొంటారని వివరించారు. ఎడమ భుజానికి కూడా ఆపరేషన్ అవసరమా ? కాదా ? అని వైద్యుల సూచన మేరకు జరుగుతుందన్నారు.