హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. 14న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఏడాది పొ డవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆల య పవిత్రతకు లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని వివరించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో ‘డయల్ యువర్ ఈవో’లో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న పుషరిణిని 1 నుంచి మూసివేసినట్టు తెలిపారు. నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపడతామని, నెల పాటు పుషరిణి హారతి ఉండదని పేర్కొన్నారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుషరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.