Road accident | పల్నాడు రోడ్డు ప్రమాదంలో 6కు పెరిగిన మృతుల సంఖ్య
Road accident | పల్నాడు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. గాయపడిన 20 మందిలో మరో వ్యక్తి మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది. ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లిన 40 మంది ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టింది.
Road accident : పల్నాడు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. గాయపడిన 20 మందిలో మరో వ్యక్తి మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది. ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లిన 40 మంది ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టింది. ఆ వెంటనే టిప్పర్లో మంటలు చెలరేగి బస్సుకు కూడా అంటుకున్నాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనయ్యారు. బస్సులోంచి కిందకు దిగేలోపే మంటలు అంటుకోవడంతో కాలిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లా చిలూకలూరిపేట మండలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ అయిన అరవింద ట్రావెల్స్ బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్కు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఆ బస్సులో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఏపీ ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారే. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బస్సు చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారి పాలెం – పసుమర్రు గ్రామాల మధ్యనున్న ఈవూరివారిపాలెంకు చేరుకోగానే ఎదురుగా కంకర లోడుతో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
డ్రైవర్ సహా ఐదుగురు బస్సులోనే సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. పోలీసులు చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

