కొడంగల్‌కు 9 వేల కోట్ల వరాలా?
‘ఒకే రాష్ట్రం.. ఒకే ప్రభుత్వం.. కానీ అభివృద్ధి నిధుల కేటాయింపులో మాత్రం ఎందుకీ తేడా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
- మునుగోడు నియోజకవర్గానికి మాత్రం నిర్లక్ష్యపు శాపాలు!
- ఇక్కడి ప్రజలు ఏం పాపం చేసిన్రు?
- ఫ్లోరైడ్ గడ్డపై అభివృద్ధి జాడేది?
- సీఎం, భట్టిని అడిగినా లాభం లేదు
- సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆవేదన
మునుగోడు, నవంబర్ 7 : ‘ఒకే రాష్ట్రం.. ఒకే ప్రభుత్వం.. కానీ అభివృద్ధి నిధుల కేటాయింపులో మాత్రం ఎందుకీ తేడా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతుంటే, ప్రపంచాన్ని వణికించిన ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా పోరాడిన మునుగోడు నియోజకవర్గానికి మాత్రం నిధుల కేటాయింపులో ఎందుకీ నిర్లక్ష్యం?’ అంటూ స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని పీఆర్ఆర్ గార్డెన్స్‌లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
కొడంగల్‌లో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడాన్ని తాను తప్పుపట్టడం లేదని, అయితే మునుగోడు వంటి వెనుకబడిన నియోజకవర్గాలకు కూడా సమానంగా నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు. ‘మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు? మాకెందుకు నిధులు రావు? ముఖ్యమంత్రి పదవి అదృష్టంతో దక్కింది. దాన్ని నేను తప్పుపట్టడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలి. మా మునుగోడు నియోజకవర్గానికి కూడా తక్షణమే నిధులు ఇవ్వాలి. ఒకప్పుడు ఫ్లోరైడ్ మహమ్మారితో వేలాది కుటుంబాలు నరకయాతన అనుభవించిన మునుగోడు ప్రాంతాన్ని అభివృద్థి చేసుకోవాలన్న తపన ఎమ్మెల్యేగా నాకు ఉన్నది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని పలుమార్లు కలిసిన. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి అవసరాలను నకిరేకల్ సభలోనూ వివరించిన. అయినా మునుగోడుకు ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెనుకబడిన నియోజకవర్గాలను గుర్తించి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. కొడంగల్‌కు కోట్లు కుమ్మరిస్తారా? మునుగోడును గాలికొదిలేస్తారా?’ ఆవేదన చెందారు. సుంకరి భిక్షంగౌడ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. సమాజంలో అవినీతి పేరుకుపోయిందని, దాన్ని తరిమే వరకు పేదలకు న్యాయం జరగదని అన్నారు. నాయకుడనే వాడు నీతిగా ఉంటే సమాజానికి నీతివంతమైనపాలన అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నెలికంటి సత్యం, శ్రీపాల్‌రెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనువాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

