హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ఆదివారం కుంకలగుంట గ్రామం నుంచి 10 మంది కలిసి కోనూరులో ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి గ్రామానికి వెళ్తుండగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గంధం సంధ్య (9), బత్తుల కార్తీక్ (12), గంధం సైనీ (10)తోపాటు కొనత చైతన్య(28) చనిపోయారు. మిగిలిన ఆరుగురిని స్థానికులు కాపాడారు.