Srisailam Temple | దేవదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను, అన్యమతానికి సంబంధించిన ఫొటోలను కలిగి ఉన్న వాహనాలు కూడా క్షేత్రపరిధిలోకి అనుమతించబడవని అధికారులు హెచ్చరించారు. క్షేత్రపరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్యమత ప్రచారం, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమేనని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి, విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.