శ్రీవారి భక్తులకు ప్రత్యేక దర్శనానికి అవకాశం ..

తిరుపతి : భారీ వర్షాలతో స్వామి వారిని దర్శించుకోని భక్తుల కోసం తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనానికి అవకాశాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30 వ తేదీ వరకు టికెట్లు బుకింగ్ చేసుకుని, వర్షాల కారణంగా దర్శనానికి రాని భక్తుల కోసం దర్శన టికెట్టు మార్చుకునే అవకవాశం కల్పించింది . టీటీడీ వెబ్సైట్లో దర్శన తేదీని మార్చుకోవడంతో పాటు.. నూతన టికెట్లను పొందే అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
పాత దర్శనం టికెట్లతో ఆరునెలలలోపు ఎప్పుడైనా నూతన టికెట్టు పొందవచ్చని వివరించారు. కాగా ప్రస్తుతం వర్షబీభత్సం తగ్గిందని, తిరుమలకు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. రెండు ఘాట్ రోడ్లలో వాహనాలను అనుమతిస్తున్నామని, శ్రీవారి మెట్ల మార్గం నాలుగు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నిర్మాణాలు దెబ్బతినలేదని ఆయన తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Cancel
- Heavy Rains
- Piligrims
- ticket
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

