Srisailam | శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఒంగోలు వాసి టీ శ్రీనివాసరావు సోమవారం వెండి నాగాభరణాన్ని విరాళంగా అందజేశారు. ఈ నాగాభరణం 3.150 కిలోల బరువు ఉంటుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు గంటి రాధాకృష్ణ అవధాని, అమ్మవారి ఆలయం ఇన్ స్పెక్టర్ కే మల్లికార్జున, గుమస్తా ఎం సావిత్రిలకు దాత ఈ నాగాభరణాన్ని అందజేశారు. వీరికి దేవాలయం అధికారులు రశీదు అందజేశారు.
అటుపై దాత టీ శ్రీనివాసరావుకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు.