తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో కొండపై ఉన్న 30 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని అధికారులు వెళ్లడించినా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని భక్తులు పేర్కొన్నారు.
కాగా నిన్న శ్రీవారిని 79,103 మంది భక్తులు దర్శించుకోగా 37,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.42 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.