Tirumala | తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి ఓ విమానం చక్కర్లు కొట్టింది. శనివారం నాడు ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. ఆలయం పై నుంచి రాకపోకలు సాగిస్తే ఉపద్రవాలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీడీపీకి సూచించారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లకుండా చరయలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ అనేకసార్లు ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నోఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరింది. అయినప్పటికీ టీటీడీ విజ్ఞప్తిపై కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోకుండా అలసత్వం వహిస్తోంది. పౌర విమాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువరు భక్తులు మండిపడుతున్నారు.