చిత్తూరు: రేణిగుంటలో త్వరలో బ్యాడ్మింటర్ అకాడమీ ప్రారంభం కానున్నది. అకాడమీ ప్రారంభం దిశగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కిడాంబి శ్రీకాంత్‌కు ప్రభుత్వం భూమిని అప్పగించింది. దీనికి సంబంధించిన పత్రాలను అధికారులు శ్రీకాంత్‌కు అందజేశారు.
రేణిగుంటలో కిడాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపిస్తున్నారు. అకాడమీ కోసం స్థలం కేటాయించాలని ఏపీ సీఎం జగన్‌కు శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. ఆయనకు రేణిగుంటలోని ఐటీ పార్క్ సమీపంలో 5.5 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మేరకు స్థలానికి సంబంధించిన పత్రాలను శ్రీకాంత్‌కు జిల్లా క్రీడాధికారి మురళీకృష్ణ, రేణిగుంట డీటీ ప్రేమ్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభిస్తానని చెప్పారు.