అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇక పంచాయతీ సెక్రెటరీ ( Secretary ) లను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పిలువనున్నారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandra Babu) అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి( Minister Parthasarathi ) మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చాలని, ఆదాయం బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలో రూ. 212 కోట్లతో రాజ్‌భవన్ నిర్మాణం, ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ. 1,200 కోట్లతో బీడీఎల్ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి , విశాఖలో రూ.87 వేల కోట్లతో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు, గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.