అమరావతి : ఏపీలో ఇసుక(Sand), మద్యం( Liquor ) పాలసీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయాన్ని మంత్రులకు వివరించానని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుకను ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌పై ఉచితంగా తీసుకెళ్లే హక్కు గ్రామస్థులకు ఉందని తెలిపారు.
పారదర్శకంగా ఇసుక పాలసీ అమలుకు జిల్లాకు ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించామని వెల్లడించారు. జిల్లాలో ఇసుక పంపిణీలో అవినీతి, అక్రమాలు జరుగుకుండా చూడవలిసిన బాధ్యత మంత్రులపైనే ఉందన్నారు. ఇసుకను తీసుకెళ్లే గ్రామస్థులపై అధికారులు కేసులు నమోదు చేస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
పాలసీలో ఎవరూ జోక్యం చేసుకున్న సహించేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అమరావతే ఉంటుందని , ఇది ఎన్డీయే నినాదమని పేర్కొన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు.