శనివారం 06 మార్చి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 20:47:17

ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది: వైసీపీ ఎంపీ

ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది: వైసీపీ ఎంపీ

అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరోనాతో ఎవరు ఇబ్బంది పడినా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌దే బాధ్యత అని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తొత్తుగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

'బాబు ఆదేశాలతో నిమ్మగడ్డ ఎన్నికలకు వెళ్లడం దురదృష్టకరం.  ఎన్నికలకు వైఎస్‌ఆర్‌సీపీ భయపడేది లేదు. ఏకగ్రీవాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.  ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది. ఏకగ్రీవంతో గ్రామాల్లో ఫ్యాక్షనిజం, విభేదాలు ఉండవు.' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 


VIDEOS

logo