తూర్పు గోదావరి జిల్లా యానంలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ..

అమరావతి : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా యానంలో అధికారులు రాత్రివేళల్లో కర్ఫ్యూను విధించారు. జిల్లాలో మొత్తం 133 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆంక్షలను విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా యానంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 2 ,95, 123 మంది కరోనా బారిన పడగా 2,93700 మంది కోలుకున్నారు. 1290 మంది మృత్యువాత పడ్డారు. రెండోస్థానంలో చిత్తూరు జిల్లా, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్తో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,959 మంది మరణించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 20లక్షల 74,426 మంది కొవిడ్ బారిన పడగా 20లక్షల 58,704 మంది కోలుకున్నారు. 14వేల 495 మంది మృత్యువాత పడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

