అమరావతి : పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ సంతోషంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. విశాఖపట్నం (Visaka) గాజువాక పట్టణంలో వడ్లపూడి రజకవీధిలో నిన్న రాత్రి న్యూ ఇయర్(New Year) సెలబ్రెషన్స్లో భాగంగా క్రాకర్ (Crakers) కాలుస్తుండగా ఒక్కసారిగా పేలి,సుద్దమళ్ల శివ అనే వ్యక్తి నుదుడిపై తీవ్రగాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
కుటుంబ సభ్యులు వెంటనే కూర్మన్నపాలెం ప్రైవేట్ ఆస్పత్రికి(Private Hospital) తరలించగా అప్పటికే మృతి చెందాడని నిర్దారించడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు బోరున రోధించారు. బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన దువ్వాడ పోలీసులు (Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.