ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 1,679 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 23,08,622 కు చేరుకున్నది. గత 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 14679 కు చేరుకున్నది. గత 24 గంటల్లో 9,598 మంది కొత్త రోగులు నయమవగా.. మొత్తం కోలుకున్న వారు 22,47,824 గా ఉన్నారు. ప్రస్తుతం 46,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొవిడ్ బులెటిన్‌ను విడుదల చేసింది.
జిల్లాల వారీగా గణాంకాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లాలో 350 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. కృష్ణ 225, గుంటూరు 212, పశ్చిమ గోదావరి 142, విశాఖపట్నం 128, కడప 104, కర్నూలు 103, నెల్లూరు 91, ప్రకాశం 87, శ్రీకాకుళం 22, విజయనగరంలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలో కోల్పోగా.. చిత్తూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరుగా గుర్తించారు.