రామగిరి, ఫిబ్రవరి 06 : టీజీ ఐసెట్ 2026 (TG ICET 2026) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) తరపున, నల్లగొండలోని ఎంజీయూ నోటిఫికేషన్‌ను వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక పరీక్ష వెబ్సైట్ icet.tgche.ac.inలో చూడవచ్చు. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.750, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలి.
టీఎస్ ఐసెట్ రిజిస్ట్రేషన్ 2026 (లేట్ ఫీజు లేకుండా)
12-ఫిబ్రవరి-2026 నుండి 16-మార్చి-2026 వరకు
రూ. 250 ఆలస్య రుసుముతో చివరి తేదీ
30-మార్చి-2026
రూ. 500 ఆలస్య రుసుముతో..
07-ఏప్రిల్-2026
దరఖాస్తు ఫారమ్ సవరణ
18-ఏప్రిల్-2026 నుండి 24-ఏప్రిల్-2026 వరకు
రూ. 5000 ఆలస్య రుసుముతో..
01-మే-2026
రూ. 10,000 ఆలస్య రుసుముతో..
03-మే-2026
టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలు
04-మే-2026
పరీక్ష తేదీలు
13-మే-2026 అలాగే 14-మే-2026
ప్రాథమిక జవాబు కీ విడుదల
29-మే-2026
ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం
30-మే-2026 నుండి 05-జూన్-2026 వరకు
తుది జవాబు కీ, ఫలితాల విడుదల
19-జూన్-2026
తెలంగాణలో ఎంబీఏ/ఎంసీఏ ప్రవేశాల కోసం ఎంజీయూ, నల్లగొండ మే 13 అలాగే 14 తేదీలలో టీజీ ఐసెట్ 2026 పరీక్షను నిర్వహించనుంది. 25 శాతం అర్హత కటాఫ్‌ను సాధించిన అభ్యర్థులు ప్రవేశ ప్రక్రియకు అర్హులుగా పరిగణించబడతారు. తెలంగాణలో ప్రవేశాల కోసం కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియను టీజీసీహెచ్ఈ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తుంది. టీజీఐసెట్ ఫలితాలు ప్రకటించిన వెంటనే తెలంగాణ ఎంబీఏ ప్రవేశాల షెడ్యూల్ విడుదల అవుతుంది. అభ్యర్థులు తెలంగాణ ఎంబీఏ ప్రవేశాల షెడ్యూల్‌ను కౌన్సెలింగ్ వెబ్సైట్ tgicet.nic.inలో చూడవచ్చు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీఎస్ ఐసెట్ కన్వీనర్, ఎంజియూ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఐసెట్ కో కన్వీనర్ డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, యూనివర్సిటీ ఎంబీఏ విభాగం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీలక్ష్మి, సరిత, లక్ష్మీ ప్రభ, ప్రవళిక, సురేష్ రెడ్డి, మారం వెంకటరమణారెడ్డి, సబీనా హెరాల్డ్, తిరుమల, పీహెచ్డీ స్కాలర్ రమేష్ నాయక్ పాల్గొన్నారు.