Naveen Polishetty | ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో మొదటిసారి రూ.100 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకున్నాడు టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయంతో నవీన్ పోలిశెట్టి తన కెరీర్లో తొలి వంద కోట్ల మైలురాయిని అందుకున్న నటుడిగా నిలిచారు.
అయితే ఈ అద్భుతమైన విజయంతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ నవీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా తమ తదుపరి ప్రాజెక్ట్‌లో నవీన్ భాగమవుతుండడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. అయితే మైత్రీ బ్యానర్లో రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందని ప్రేక్షకులకు ఎదురుచూస్తున్నారు.
Thank you so much ❤️🙏 @MythriOfficial massively pumped ❤️😍🙏 we will bring you guys something very very exciting 🔥💪 https://t.co/bJE0JfZMIw
— Naveen Polishetty (@NaveenPolishety) February 6, 2026