Srisailam | శ్రీశైలం : ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ నెల 16న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదివారం పరిశీలించారు. ప్రధాని పర్యటించే ప్రదేశాల్లో హెలీపాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, ఆలయ పరిసరాలు, సేఫ్ హౌస్ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైల పరిసర ప్రాంతాలలు, నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ సాయిధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.