Srisailam Temple | శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీశైలంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభమై నందిమండపం వరకు సాగిన ప్రభోత్సవంలో వేలాది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
Srisailam Temple
వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ప్రభపై అర్చకులు, వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల ఆశీస్సులు, అక్షింతలు అందజేశారు. ప్రభోత్సవం ఎదుట కోలాటాలు, చెక్కభజనలు, సాంప్రదాయ మేళాల చప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఈవో శ్రీనివాసరావు అన్నారు.
Srisailam Temple
ప్రభోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లు నంది వాహనంసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం సాయంత్రం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లును వేంచేపుచేసి షోడషోపచార పూజలు చేసినట్లు ఈవో తెలిపారు. ఆ తర్వాత స్వామిఅమ్మవార్లు నందివాహన పై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉత్సవం ఆద్యంతం కళారూపాలతో ఆకట్టుకునేలా సందడిగా సాగింది.
Srisailam Temple 05
Srisailam Temple