అమరావతి : ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో పెట్టిన ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తుంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు (Arogya Shri Trust) కు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు(NTR) వైద్య సేవ పేరును పునరుద్దరించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ (TDP) హయాంలో ఉన్న పేరును వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గా పేరును మార్చింది.
అదే విధంగా వైఎస్సార్ యంత్రసేవ కేంద్రాలను విలేజ్/క్టస్టర్ సీహెచ్‌సీలు, వైఎస్సార్ యాప్‌ను వీఏఏ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్‌గా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వడ్డీలేని రుణాలుగా, ఈ క్రాప్‌ను ఈ-పంటగా, వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్‌ను అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ఫామ్ మెకనైజేషన్ స్కీం, డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లుగా, పేర్లు మార్పు చేసింది.
ఎంకే మీనాకు కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం