అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు ఓ మహిళా లెక్చరర్(Women Lecture) ను దారుణంగా హత్య ( Murder) చేశారు. జిల్లాలోని మదనపల్లెలోని జ్ఞానాంబికా జూనియర్ కళాశాలలో మహిళా లెక్చరర్‌గా పనిచేస్తున్న రుక్సానా ( 32 ) గురువారం సాయంత్రం కళాశాలలో విధులు ముగించుకుంది.
ఆమె నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా దారికాచిన దుండగులు ఆమెపై దాడిచేసి గొంతుకోసి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న మదనపల్లె పోలీసులు (Police ) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దుండగులు ఎవరనేది సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.