RRR | సమయం ఇవ్వండి… సీఐడీ విచారణాధికారికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ..

అమరావతి: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)విచారణాధికారికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈరోజు విచారణకు హజరుకాలేక పోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం బాలేదని, డాక్టర్లను సంప్రదించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసును సవాలు చేస్తూ… రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సిఐడికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈనెల12న ఇచ్చిన సమన్లపై కూడా పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నదని, ఈ పరిణామాల నేపథ్యంలో…తనకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

