అమరావతి : సృష్టిలో తియ్యనిది అమ్మప్రేమ. నవమోసాలు మోసి బిడ్డలను కని ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మ తన బిడ్డ ప్రాణాల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంటల్లో ఆహుతైన విషాద ( Tragedy ) ఘటన మార్కాపురం ( Markapuram ) బస్సు ప్రమాదంలో చోటు చేసుకుంది.
బుధవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్ లారీని ఢీకొని మంటలు చేలరేగి 14 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన సమయంలో బస్సులోనే ప్రయాణిస్తున్న కనిగిరి మండలం మందాడి వారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), ఆమె కుమారుడు కొడుకు మనోహర్ కూడా ఉన్నారు.
ప్రమాదానికి గురైన బస్సులో మంటలను గమనించిన తల్లి కొడుకును బయటికి తోసేసింది. అదే సమయంలో మంటలు ఎక్కువ కావడంతో రమాదేవి బస్సు మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. కళ్లెదుటే తల్లి మరణించడంతో కుమారుడు మనోహర్ రోదనలు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేశాయి.