Tirumala | రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి తర్వాత రెండో మలుపు దగ్గర బండరాళ్లు రహదారిపై పడ్డాయి.
వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది.. రోడ్డుపై పడిన బండరాళ్లను జేసీబీల ద్వారా తొలగించారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.#Tirumala #LandSlides #AndhraPradesh #UANow #GhatRoad pic.twitter.com/0TohetV42v
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) October 16, 2024
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో అప్రతమత్తమైన టీటీడీ.. శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను అనుమతించడం లేదు. ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది.