హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.1 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో శనివారం భూకంపం సంభవించినట్టుగా హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పశ్చిమ అద్దంకి ప్రాంతంలో కేంద్రీ కృతమైనట్టుగా ప్రకటనలో తెలిపారు. ముండ్లమూరు మండలంలో సుమారు రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టుగా స్థానికులు పేర్కొన్నారు. శంకాపురం, తాళ్లూరు, పసుపుగల్లు, మారెళ్ల, వేంపాడు, తూర్పు కంభంపాడు, రామభద్రాపు రం, గంగవరం, వంటి సమీప గ్రామాల్లోనూ భూమి కంపించిందని పేర్కొన్నారు.