(Bosta on BJP) విజయవాడ: ఏపీలో తన ఉనికిని చాటుకునేందుకే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ నిర్వహించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉండొచ్చు గానీ ఏపీలో మాత్రం అలాంటి పార్టీ లేనే లేదన్నారు. విజయవాడలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ఆంద్రప్రదేశ్‌లో బీజేపీ ఉన్నదని చెప్పేందుకే ఇవాళ సభ నిర్వహించారని వ్యాఖ్యానించారు.
బహిరంగ సభ వల్ల ప్రజలకు ఒకరిగే ప్రయోజనం ఏమీ లేదని, నేతలపై అసత్య ఆరోపణలు చేయడం తప్పా అని బొత్స మండిపడ్డారు. వివిధ పారమితులపై ఆంధ్రప్రదేశ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకులను గుర్తు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ర్యాంక్ ఏమిటో ఒకసారి చూసుకోవాలని బొత్స చురకలంటించారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఎందుకు వెనుకబడిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటీఎస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఇది స్వచ్ఛంద పథకమని, పేదలపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..