హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలు పెంచుతున్నట్టు దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి తెలిపారు. దీంతో 3,208 మంది అర్చకులకు లబ్ధిచేకూరనున్నది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కార్తీక మాసం సం దర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగురాష్ట్రాల్లో 11 నుంచి 17 వరకు ‘మనగుడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీటీ డీ అధికారులు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో ఏడు రోజులపాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు చేయనున్నట్టు వివరించారు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో 28 నుంచి డిసెంబర్ 6 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.